హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ

VZM: భోగాపురం పరిధిలోని కొల్లిపేట గ్రామంలో పీఆర్‌బీటీ రోడ్డు నుంచి స్మశాన వాటిక వరకు సుమారు రూ.12.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే లోకం నాగ మాధవి భూమిపూజ చేసి శ్రీకారం చుట్టారు. ఈ సీసీ రోడ్డు నిర్మాణంతో స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.