హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రిలో తప్పిన పెను ప్రమాదం

NRPT: మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం పెను ప్రమాదం తప్పింది. ప్రసూతి, శిశు ఆరోగ్య కేంద్ర విభాగంలో పేషెంట్ల బంధువులు వెయిటింగ్ హాల్లో ఉండగా పైకప్పు పెచ్చులూడిపడ్డాయి. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. 2010లో ప్రారంభమైన ఈ ఆసుపత్రి 16 ఏళ్లకే శిథిలావస్థకు చేరుకోవడం నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.