హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెగా మెడికల్ క్యాంప్‌ను పరిశీలించిన డీఎమ్‌హెచ్‌వో

బాపట్ల ఏరియా వైద్యశాలలో సేవా సంకల్ప అభయాన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయమ్మ పరిశీలించారు. ఓపీ, ఫార్మసీ, ల్యాబ్, క్షయ నిర్మూలన విభాగాలను తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ, డాక్టర్ సోమ్లా నాయక్ తదితరలు పాల్గొన్నారు.