JGL: జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బీఎస్ లత నేడు పదవీ విరమణ చేయనున్నారు. 1987 మే 16న ప్రభుత్వ సేవలో చేరిన ఆమె వివిధ హోదాల్లో సుదీర్ఘకాలం సేవలందించారు. జగిత్యాల జిల్లాలో రెవెన్యూ, ధాన్యం కొనుగోళ్లు, ప్రజావాణి తదితర అంశాల్లో బాధ్యతలు నిర్వహించారు. నేడు ఆమెకు జిల్లా అధికారులు, సిబ్బంది వీడ్కోలు కార్యక్రమం నిర్వహించనున్నారు.
తెలంగాణ
అదనపు కలెక్టర్ బీఎస్ లతకు వీడ్కోలు


