MDK: నర్సాపూర్ మండలం లింగాపూర్‌లో వారం రోజులుగా చెత్త సేకరణ బండి రాకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల వద్ద చెత్త పేరుకుపోవడంతో కొందరు అక్కడే తగలబెడుతున్నారు. పలు వీధుల్లో చెత్త కుప్పలు పేరుకుపోయి దుర్వాసన వస్తోందని, పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చెత్త సేకరణ చేపట్టాలని కోరారు.
తెలంగాణ
నర్సాపూర్‌లో చెత్త సేకరణకు ఆటంకం


