హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్టోబర్ 1 నుంచి జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: SP

ADB: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలో అక్టోబర్ 1 నుంచి 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించరాదన్నారు. అధిక శబ్దాల డీజేలు, మైకులు పూర్తిగా నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని SP హెచ్చరించారు.