MDCL: ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఉప్పల్ డిపో ప్రాంతంలో బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. సీఎం వ్యాఖ్యలు దేశంలోని హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. కులాలు, మతాల పేరుతో ప్రజలను విభజించే రాజకీయాలకు కాంగ్రెస్ పాల్పడుతోందని విమర్శించారు.
తెలంగాణ
సీఎం దిష్టిబొమ్మ దహనం


