హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని నిరసన

VZM: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం విజయనగరం కలెక్టరేట్ వద్ద జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.