హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపాలిటీలో సఫాయి మిత్ర కార్యక్రమం

NLG: దేవరకొండ మున్సిపాలిటీలో బుధవారం స్వచ్ఛత హీ సేవా-2026 కార్యక్రమంలో భాగంగా సఫాయి మిత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌ పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, కమిషనర్ రామదుర్గారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సఫాయి మిత్రలు ప్రతిరోజూ పట్టణ పరిశుభ్రత కోసం అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని, వారి ఆరోగ్యం, భద్రత ముఖ్యమన్నారు.