BHPL: చిట్యాల మండలం నవాబుపేట శివారులోని గుట్టను అక్రమంగా తవ్వి మొరం తరలిస్తున్నారని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ ఆరోపించారు. బుధవారం స్థానిక నాయకులతో కలిసి గుట్టను పరిశీలించారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే పేరుతో అనుమతులకు మించి తవ్వకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అధికారులు స్పందించి తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
గుట్ట తవ్వకాలపై సీపీఐ(ఎంఎల్) ఆగ్రహం


