ATP: అనంతపురం నగరంలో రూ.2.66 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి భూమి పూజ చేశారు. టవర్ క్లాక్-రైల్వే స్టేషన్ రహదారి, పలు డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు. అనంతరం మైనార్టీ కమిటీ హాల్‌ను అందుబాటులోకి తెచ్చారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ.2.66 కోట్లతో అభివృద్ధి పనుల ప్రారంభం: ఎమ్మెల్యే


