హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేగూర్‌లో అండర్ డ్రైనేజ్ పనులు ప్రారంభం

RR: నందిగామ మండలం చేగూర్ గ్రామంలో రూ. 2 లక్షల గ్రామపంచాయతీ నిధులతో అండర్ డ్రైనేజ్ పనులను సర్పంచ్ మంకాల శ్రీశైలం ప్రారంభించారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. అభివృద్ధికి గ్రామపంచాయతీ నిధులను సద్వినియోగం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శివశంకర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.