హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేడి సాంబారు పడి 12 మందికి తీవ్ర గాయాలు

తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని మల్లాం బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం కోసం వంటకాలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో అన్నదాన తయారీ కేంద్రం వద్ద వేడి సాంబారు పడటంతో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని చైన్నెలోని ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.