హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.1.56 కోట్లతో రహదారి పనులకు శంకుస్థాపన

E.G: రాజానగరం మండలం రాధేయపాలెంలో రూ.1.56 కోట్లతో కానవరం–రాధేయపాలెం నుంచి జెడ్. మేడపాడు వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బుధవారం శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో గ్రామాలను ప్రధాన రహదారులతో అనుసంధానించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు.