NLG: కర్ణాటకలో వర్షాలు తగ్గడంతో తుంగభద్ర వరద ఉద్ధృతి తగ్గింది. రాజోలి సమీపంలోని సుంకేసుల బ్యారేజీకి బుధవారం ఉదయం 1,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. గేట్లు మూసివేశారు. కర్నూలు-కడప కాలువకు 1,540 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద త్వరగా తగ్గడంతో నది నీటిపై ఆధారపడి పంటలు సాగు చేసిన రైతుల్లో ఆందోళన నెలకొంది.
తెలంగాణ
సుంకేసుల గేట్లు మూసివేత


