హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయస్థాయి పోటీలకు నకరికల్లు విద్యార్థులు

పల్నాడు జిల్లా నకరికల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు సబ్‌ జూనియర్ జాతీయస్థాయి ఆట్యా–పాట్యా పోటీలకు ఎంపికయ్యారు. కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి వీరు ఎంపికయ్యారని హెచ్‌ఎం శ్రీనివాసరావు తెలిపారు. అక్టోబర్ 1–4 వరకు హైదరాబాద్‌లో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొననున్నారు.