హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆధార్ శిబిరాన్ని పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో

అన్నమయ్య: కలకడ మండలం భాటవారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఆధార్ శిబిరాన్ని డిప్యూటీ ఎంపీడీవో చక్రపాణి సందర్శించారు. శిబిరంలో జరుగుతున్న ఆధార్ నమోదు, సవరణ ప్రక్రియను పరిశీలించి, విద్యార్థులకు అందుతున్న సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆధార్ వివరాల్లో మార్పులు, సవరణలు అవసరమైన వారు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.