NRPT: కుల వివక్షకు తావిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ రామకోటి, మరికల్ ఎస్‌ఐ రామ్‌లాల్ నాయక్ హెచ్చరించారు. బుధవారం పసుపుల గ్రామంలో సర్పంచ్ నర్మదా రవి గౌడ్ ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని కులాల వారికి ఆలయ ప్రవేశం కల్పించాలని, గ్రామంలో రెండు గ్లాసుల పద్ధతిని పూర్తిగా విడనాడాలని గ్రామస్తులకు సూచించారు.
తెలంగాణ
కుల వివక్ష చూపిస్తే కఠిన చర్యలు


