హైదరాబాద్: 28°C
తెలంగాణ

మనస్తాపంతో వృద్ధ దంపతుల ఆత్మహత్య

SRD: నారాయణఖేడ్ మండలం చాప్త(కె) గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుమారులు పట్టించుకోవడం లేదనే మనస్తాపంతో వృద్ధ దంపతులు గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను నర్సారెడ్డి(88), అంజమ్మ(85)గా గుర్తించారు. గతంలో తమ ముగ్గురు కుమారులపై వృద్ధ దంపతులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినా మారకపోడంతో మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.