GDWL: అలంపూర్ గాంధీచౌక్ వద్ద సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ నాయకులు బుధవారం నిరసన తెలిపారు. తొలగించిన పాత గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, పాలకులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
అలంపూర్‌లో గాంధీ విగ్రహ ఘటనపై నిరసన


