హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూడు విభాగాల్లో మెరిసిన రాయికల్ విద్యార్థులు

JGL: కోరుట్లలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి పాఠశాలల క్రీడల్లో రాయికల్ మండలం సత్తా చాటింది. అండర్-14 బాలికల కబడ్డీలో ప్రథమ, అండర్-17 బాలుర విభాగంలో ప్రథమ, అండర్-14 బాలుర విభాగంలో ద్వితీయ స్థానాలు సాధించి మూడు కప్‌లు కైవసం చేసుకుంది. విద్యార్థుల ప్రతిభను ఎంఈఓ రాఘవులు, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి రాజగోపాల్ అభినందించారు.