MNCL: వేమనపల్లి మండలం నీల్వాయి పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని కోడూరి నేహశ్విత జిల్లా స్థాయి ఆర్ట్ అండ్ కల్చరల్ పోటీల్లో ప్రతిభ కనబరిచింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు గిరిధర్ బుధవారం మాట్లాడుతూ.. స్టోరీ టెల్లింగ్ విభాగంలో ప్రథమ స్థానం సాధించి పాఠశాల, గ్రామానికి పేరు తీసుకొచ్చిందన్నారు. గ్రామస్థులు నేహశ్వితను అభినందించారు.
తెలంగాణ
ఆర్ట్ అండ్ కల్చరల్ పోటీల్లో కోడూరి నేహశ్విత ప్రతిభ


