కరీంనగర్: శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు కనకం నాగయ్య గుండెపోటుతో మరణించాడు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పార్టీ నాయకులతో కలిసి ఆయన భౌతిక దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గంట మైపాల్, మాజీ జెడ్పీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
తెలంగాణ ఉద్యమంలో నాగయ్య సేవలు చిరస్మరణీయం


