హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ వారసుడితో 5.10 ఎకరాలు స్వాహా

VKB: కోటిపల్లిలో చనిపోయిన వ్యక్తికి నకిలీ వారసుడిని సృష్టించి 5.10 ఎకరాల భూమిని కాజేసిన ఉదంతం వెలుగుచూసింది. బార్వాద్ పరిధిలోని సర్వే నంబర్ 251 భూమికి ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. బాధితుడు అబ్దుల్ సత్తార్ ఫిర్యాదుతో కరీంపూర్ మాజీ సర్పంచ్ సుందరి అనిల్‌తో పాటు మరో ఇద్దరిపై కోట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.