హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రైనేజీ లేక రోడ్డుపైనే మురుగునీరు..!

కృష్ణా: కత్తివెన్ను మండలం మాట్లం గ్రామంలో కృష్ణుడి గుడి నుంచి పెన్నమ్మదిబ్బ వైపు వెళ్లే రహదారిపై డ్రైనేజీ లేక మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడటమే కాక, దుర్వాసన, దోమల బెడదతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి డ్రైనేజీ వసతి ఏర్పాటు చేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.