హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏడేళ్ల విద్యుత్ కేబుల్ సమస్యకు పరిష్కారం

NTR: వత్సవాయి మండలం మాచినేనిపాలెం ఎస్సీ కాలనీలో ఏడేళ్లుగా కొనసాగుతున్న విద్యుత్ కేబుల్ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. గ్రామానికి చెందిన ఆశీర్వాదం పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేయడంతో జగ్గయ్యపేట ఎలక్ట్రికల్‌ ఏడీ శ్రీనివాసరావు రెండు కిలోమీటర్ల కొత్త కేబుల్‌ను మంజూరు చేశారు. దీంతో వర్షాకాలంలో తరచూ ఎదురవుతున్న విద్యుత్‌ అంతరాయాలకు పరిష్కారం లభించింది.