హైదరాబాద్: 28°C
తెలంగాణ

మీసేవ కేంద్రాల కేటాయింపులో తీవ్ర అవకతవతలు

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మీసేవ కేంద్రాల కేటాయింపులు తీవ్ర అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని టీఎస్ ఎంఆర్పిఎస్ దక్షిణ తెలంగాణ అధ్యక్షులు శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. బుధవారం ఆర్అండ్‌బీ అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహమ్మదాబాద్ మండలంలో అర్హులను కాదని అనర్హులకు మీ సేవలో కేటాయించారని అన్నారు.