ప్రకాశం: ఒంగోలులో బాలికల నిర్బంధం ఘటన కలకలం రేపింది. వసతి గృహంలో ఉంటున్న బాలికలను, తండ్రి డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తానంటూ వంట మనిషి బయటకు తీసుకెళ్లి, ఓ రిటైర్డ్ ఉద్యోగి వద్ద వదిలినట్లు సమాచారం. అక్కడ బాలికలను నిర్బంధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ బాలిక బంధువులకు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు రిటైర్డ్ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
బాలికల నిర్బంధం.. అసలేం జరిగింది?


