హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎర్రవరంలో ఇళ్ల స్థలాల పరిశీలన

AKP: అచ్యుతాపురం మండలం ఎర్రవరం గ్రామంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు బుధవారం స్థల పరిశీలన చేపట్టారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ ఆదేశాల మేరకు కూటమి నాయకులు అగ్గాల భాస్కర్‌రావు, గుడేల కనకారావు, వీఆర్వో, సర్వేయర్‌ క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించారు. అర్హుల జాబితా సిద్ధం చేసి త్వరలో పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు.