PDPL: ఓదెల మండలం పొత్కపల్లిలో సరైన బస్టాండ్ సౌకర్యం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ, వానలో చెట్ల కిందే బస్సుల కోసం వేచి ఉండాల్సి వస్తోందని స్థానికులు తెలిపారు. మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అన్ని సౌకర్యాలతో బస్టాండ్ ఏర్పాటు చేయాలని కోరారు.
తెలంగాణ
బస్టాండ్ లేని బస్టాప్!


