CTR: వెదురుకుప్పం జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని మాజీ ఎంపీటీసీ సభ్యుడు మోహన్ మురళి అధికారులను కోరారు. బుధవారం విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పాఠశాల గ్రౌండ్‌ను పరిశీలించారు. విద్యార్థులు ఆటలు ఆడే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన వారి దృష్టికి తీసుకుపోయారు. అధికారులు సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
'కరెంట్ పోల్స్ తొలగించాలని వినతి'


