హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రైనేజీ సమస్యతో ప్రజలకు ఇబ్బందులు

అన్నమయ్య: వెంకటాపురం 14వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కాలువలు పొంగిపొర్లి మురుగునీరు రోడ్లపైకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పలుమార్లు సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.