హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్రకు ప్రత్యేక అథారిటీ: విజయ‌సాయి రెడ్డి

VSP: తాను పెట్టబోయే పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్ర రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తామని విజయసాయి రెడ్డి ప్రకటించారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ఈ అథారిటీకి డిప్యూటీ సీఎం నాయకత్వం వహిస్తారని, ప్రతి ఏడాది బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పారు. ఆ నిధులతో ఉత్తరాంధ్రను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.