హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్లలో సీసీ రోడ్లకు శంకుస్థాపన

BPT: బాపట్ల 1, 2, 3 వార్డుల్లో బుధవారం నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు శంకుస్థాపన చేశారు. జమ్ములపాలెం రోడ్డులో కార్యక్రమం జరిగింది. పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమన్నారు. నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.