హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదకర మూలమలుపులు.. బోర్డులు ఏవీ..?

SDPT: కొండపాక మండలం మర్పడగ నుంచి తొగుట మండలం తుక్కాపూర్‌ వెళ్లే ప్రధాన రహదారిపై మూడు ప్రమాదకర మూలమలుపులు ఉన్నాయి. వేగ పరిమితి, హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు తెలిపారు. వందల ప్రమాదాలు జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని ఇరు మండలాల వాసులు వాపోయారు. ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.