హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పట్టణంలో చెడ్డీ గ్యాంగ్ కలకలం

SS: ధర్మవరం పట్టణంలో ఒకే రాత్రి వరుసగా నాలుగు ఇళ్లలో చోరీలకు చెడ్డీ గ్యాంగ్ యత్నించింది. కిటికీ తలుపులు పగలగొడుతుండగా వచ్చిన శబ్దాలకు ఇంటి యజమానులు అప్రమత్తమవ్వడంతో దుండగులు అక్కడ నుంచి పరారయ్యారు. ఏడుగురు సభ్యులు ఉన్న ఈ ముఠా సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వన్‌టౌన్ సీఐ రెడ్డప్ప ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.