హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరం'

SKLM: ఇచ్ఛాపురంలో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరం నిర్వహించారు. పుర కమిషనర్ నల్లి రమేష్ మాట్లాడుతూ.. కార్మికుల కోసం తరచూ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పట్టణ శానిటేషన్ కార్యాలయం వద్ద డా. అఖిల్ మనోహర్, డా. రమ్య 73 మంది కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు.