హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపటి నుంచి ఇర్ఫాని దర్గా ఉర్సు ఉత్సవాలు

SRD: సంగారెడ్డి శివారులోని ఇర్ఫాని దర్గాలో 24వ ఉర్సు ఉత్సవాలను రేపటి నుంచి నిర్వహించనున్నట్లు పీఠాధిపతి ఉమర్ బీన్ అహ్మద్ తెలిపారు. 1న గంధం ఊరేగింపు, అఖిల భారత కవి సమ్మేళనం, 2న దీపారాధన, ఖవ్వాలి, అన్నదానం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉత్సవాలకు వివిధ ప్రాంతాలు, ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి భక్తులు హాజరుకానున్నట్లు తెలిపారు.