హైదరాబాద్: 28°C
తెలంగాణ

బెట్టింగ్ మాయలో పడి.. యువకుడు ఆత్మహత్య

SRD: బొంతపల్లికి చెందిన శ్రీకాంత్ (23) అనే యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ. 9 లక్షలు నష్టపోయి ఇంట్లో ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. కొంతకాలంగా పనిలేకుండా ఇంటి వద్దే ఉంటున్న అతడు, అప్పుల బాధ, తీవ్ర మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.