హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనాథకు జై జవాన్ జై కిసాన్ ఫౌండేషన్ పునర్జన్మ!

BPT: చిన్నగంజాం మండలం జీడిచెట్లపాలెం వద్ద తీవ్ర అనారోగ్యంతో రోడ్డుపై ఉన్న పింజల భాను ప్రసాద్ అనే అనాథకు జై జవాన్ జై కిసాన్ సేవా ఫౌండేషన్ సభ్యులు అండగా నిలిచారు. ఆయనను శుభ్రపరిచి చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందించారు. సోషల్ మీడియా ద్వారా వివరాలు సేకరించి, రావూరిపేటలోని ఆయన కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు.