హైదరాబాద్: 28°C
తెలంగాణ

పనుల్లో నిర్లక్ష్యం వహించవద్దు: కలెక్టర్

HNK: జిల్లాలో వీవో భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. బ్యాంకు లింకేజీ రుణాల వసూళ్లను 100 శాతం పూర్తి చేసి ఎన్‌పీఏను సున్నాకు తీసుకురావాలని సూచించారు. పరకాలలో మహిళా డెయిరీ ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని, పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దని ఆదేశించారు.