BDK: మణుగూరు మండలం సింగారం గ్రామపంచాయతీలో పారిశుధ్య సమస్యలపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. గ్రామంలో చెత్తకుప్పలు, పందుల సంచారం, మురుగునీటి పారుదల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదని ఆరోపించారు.
తెలంగాణ
చెత్తకుప్పలతో సింగారం ప్రజల అవస్థలు


