NDL: సంజామల (మం) ముదిగేడులో బుధవారం తహశీల్దార్ చంద్రశేఖర్ రైతులకు డ్రాఫ్ట్ పాస్‌పుస్తకాలు అందజేశారు. పాస్‌పుస్తకాల్లోని ఫొటో, సర్వే నంబర్, భూమి విస్తీర్ణం తదితర వివరాలను రైతులు పరిశీలించుకోవాలని సూచించారు. వివరాలన్నీ సరిగ్గా ఉంటే వాటి ఆధారంగానే పాస్‌పుస్తకాలు జారీ చేస్తామని తెలిపారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పాస్‌పుస్తకాలు అందజేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు డ్రాఫ్ట్ పాస్ పుస్తకాల పంపిణీ


