హైదరాబాద్: 28°C
తెలంగాణ

లిఫ్ట్‌-1 పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

JN: చిల్పూర్ మండలం లింగంపల్లి శివారులో నిర్మిస్తున్న గండిరామారం ఎత్తిపోతల పథకం లిఫ్ట్‌-1 పంప్‌హౌస్‌ పనులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం పరిశీలించారు. ఇరిగేషన్‌ అధికారులతో కలిసి నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. రైతులకు సాగునీరు అందించడంలో పథకం కీలకంగా ఉండేలా పనులపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు.