WNP: నియోజకవర్గంలో గుడిసెల్లో నివసిస్తున్న 268 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో అర్హులైన పేదలకు ఇళ్లు అందించే ప్రక్రియ కొనసాగుతోంది. రెండో విడతలో నియోజకవర్గానికి 2,000 ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు కల్పించి గుడిసెలు లేని వనపర్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యం అన్నారు.
తెలంగాణ
'గుడిసెలు లేని వనపర్తే లక్ష్యం'


