హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆరోగ్యంపై విద్యార్థులు శ్రద్ధ పెట్టాలి'

మంచిర్యాల: విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని ఆర్బీఎస్కే వైద్యులు డాక్టర్ గౌరీ శంకర్, జన్నారం మండలంలోని కలమడుగు జడ్పీ పాఠశాల హెచ్ఎం కట్టారాజమౌళి సూచించారు. బుధవారం ఉదయం పాఠశాలలో చదువుకుంటున్న 156 మంది విద్యార్థులకు ఆర్బీఎస్కే ద్వారా వివిధ వైద్య పరీక్షలు అందజేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అలాగే ఆరోగ్య సలహాలు కూడా ఇచ్చారు.