BHPL: తాడిచర్ల మండల కేంద్రంలో పింఛన్ దరఖాస్తుల విషయంలో మధ్యవర్తుల జోక్యంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. పింఛన్‌కు దరఖాస్తు చేసుకునే అర్హుల నుంచి కొందరు మధ్యవర్తులు డబ్బులు వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్కో దరఖాస్తుదారుడి నుంచి సుమారు రూ.1,500 నుంచి రూ.3,000 వరకు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
పింఛన్ దరఖాస్తులకు రేట్లు పెట్టారా?


