హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రెయిన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ

NDL: డోన్ పట్టణంలోని వైఎస్ నగర్‌లో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి భూమిపూజ చేశారు. డ్రెయిన్ల నిర్మాణంతో వర్షపు, మురుగునీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.