హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్లూరు CHC సూపరింటెండెంట్‌పై వేటు

KMM: కల్లూరు CHC ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బానోత్‌ రమేష్‌ను బాధ్యతల నుంచి తొలగిస్తూ అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీజ ఉత్తర్వులు జారీ చేసినట్లు బుధవారం వెల్లడించారు. ఆసుపత్రి నిర్వహణ సక్రమంగా లేకపోవడం, విధులకు గైర్హాజరవుతున్నారంటూ ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇన్‌చార్జ్‌ బాధ్యతలను ఎండీ రంజితకు అప్పగించారు.