హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ.. తాగునీరు వృథా

ASF: కెరమెరి మండలంలోని SC కాలనీలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ కారణంగా తాగునీరు వృథాగా పోతోంది. పైప్ లైన్ నుంచి పెద్దఎత్తున నీరు బయటకు రావడంతో రహదారిపై నీరు నిలిచిపోతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి లీకేజీని అరికట్టి, పైప్ లైన్ మరమ్మతులు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.